సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (16:44 IST)

హైదరాబాద్ వెళ్లొచ్చాక పట్టించుకోవడంలేదు... మా బావ మీద డౌటు...

నాకు మా బావంటే ఎంతో ఇష్టం. ఆయననే ప్రేమించాను. ఆయన్నే పెళ్లాడుతానని చాలామందితో చెప్పేదాన్ని. కానీ మా బావ ఏనాడూ నన్ను చేసుకుంటానని చెప్పలేదు. ఓ రోజు హైదరాబాదు నుంచి ఏకంగా ఓ అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నానని పరిచయం చేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి నాకూ పెళ్లయింది. కొత్తలో మా ఆయన నాతో చక్కగా శృంగారంలో పాల్గొనేవాడు. 
 
ఇటీవల మా బావ, నా భర్త కలిసి నాలుగు రోజులు బిజినెస్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లొచ్చారు. అప్పట్నుంచి నా భర్తలో తేడా కనబడుతోంది. ఎంత బతిమాలినా శృంగారం చేసేందుకు ససేమిరా అంటున్నాడు. ఈ విషయంలో మా బావ మీద నాకు డౌట్ వస్తోంది. నేను ఆయన్ను ప్రేమించానని ఈయనకు చెప్పాడేమో అని అనుమానంగా ఉంది. అందువల్ల ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడా...? ఇప్పుడు అసలు విషయం ఈయనకు చెప్పేసేదా...? చెబితే ఏమయినా అవుతుందా?
 
మీ బావను మీరు ప్రేమించారన్న విషయం ఇప్పుడు కొత్తగా చెప్పడం వల్ల లేనిపోని కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ చెప్పకుండా ఇప్పుడు చెప్పడంలో అర్థమేమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. అసలు మీ బావకు, మీకు శృంగార పరంగా ఎలాంటి సంబంధం లేనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సహజంగా కొంతమంది మరదళ్లు అనుకున్నట్లే మీరూ అనుకున్నారు. ఇందులో తప్పేమీ లేదు. దాన్ని ఆయనకానీ, మీరుకానీ అంత పెద్దది చేసి చూడాల్సిన పనిలేదు. 
 
ఇకపోతే... శృంగారంలో పాల్గొనకపోవడానికి కారణం వేరే అయి ఉండవచ్చు. ముందు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించాల్సి ఉంది. ఏదయినా అనారోగ్యం సమస్య ఉన్నట్లయితే ఆ సమర్థతపై దాని ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు. వ్యాపారం అంటున్నారు కనుక కొందరిలో ఆర్థికపరమైన చిక్కులు కారణంగా మక్కువ తగ్గుతుంది. ఇదికూడా కారణం కావచ్చు. కనుక ఆ కోణంలో ఆలోచించి సమస్యను పరిష్కరించుకోండి.