చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
బిజెపి - టిడిపి విడిపోయిన తరువాత రెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో విమర్సలు, ప్రతివిమర్సలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ ఎపిలో వార్తల్లో నిలుస్తున్నారు బిజెపి, టిడిపి నేతలు. తాజాగా ఎపి సిఎం చంద్రబాబునాయుడుపై బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు కొత్తగా పెళ్ళి చేసుకున్న రాజకీయ అజ్ఞాని అంటూ విమర్సలు గుప్పించారు. రాహుల్ గాంధీ అతని మాటలు విని రాఫెల్ కుంభకోణంపై చంద్రబాబు మాట్లాడి అబాసుపాలయ్యారని విమర్సించారు. రాఫెల్ కుంభకోణంలో కేంద్రప్రభుత్వం ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు నిచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తించుకోవాలని, అనవసరమైన విమర్సలు బిజెపిపై చేసి విలువ పోగొట్టుకోవద్దని సూచించారు.