కన్నీళ్ళు పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Video)

Babu
జె| Last Modified శనివారం, 15 డిశెంబరు 2018 (13:38 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ చెల్లెలు హైమావతి కుమారుడు ఉదయ్ కుమార్ గుండెపోటుతో నిన్న ఆకస్మికంగా మృతి చెందారు. పార్థీవ దేహాన్ని స్వగ్రామం తిరుపతి సమీపంలోని నారావారిపల్లికి తీసుకొచ్చారు. ఉదయ్ కుమార్ అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రితో పాటు ఐటీ శాఖామంత్రి నారా లోకేష్‌, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మిణి, నారా రోహిత్, పరిశ్రమల శాఖామంత్రి అమరాథరెడ్డిలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఉదయ్ కుమార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఓదార్చారు. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :