శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Modified: బుధవారం, 28 నవంబరు 2018 (16:38 IST)

తెలంగాణ జనసేన ప్రజాకూటమికి మద్దతివ్వాలి... ఖమ్మంలో చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ మిత్రత్వాన్ని అలాగే గుర్తించుకున్నట్లు ఖమ్మం సభలో స్పష్టంగా కనబడింది. ఖమ్మం సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ... ఖమ్మం నియోజకవర్గ పరిధిలోని మొత్తం 10 శాసన సభ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులను అన్ని పార్టీలకు చెందిన వారు గెలిపించాలన్నారు. ప్రత్యేకించి తెలంగాణ జనసేన కార్యకర్తలు అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరి దీనిపై జనసే అధినేత పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
 
ఇకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... కేసీఆర్ నన్ను ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదు. మీకేమైనా అర్థమవుతుందా అని అడిగారు. దేశానికి కాంగ్రెస్-తెదేపా కలయిక చారిత్రక అవసరం. రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడతా. అభివృద్ధి జరగలేదు... దారుణంగా వుంది. భాజపాకు ఓట్లు లేవు, హెలికాప్టర్లున్నాయి. డబ్బులు తీసుకుని ఇక్కడికి వచ్చారు.. జాగ్రత్త. కేసీఆర్-ఎంఐఎంకు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి ఓటు వేసినట్లే. ఇంకా ఐదు రోజులే వుంది ఓటు వేయడానికి... మీరందరూ ప్రజా కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు.