బావ చేతిలో మోసపోయానంటున్న తారా చౌదరి

tara chowdary
Last Updated: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (10:36 IST)
తారా చౌదరి... హైటెక్ వ్యభిచార సూత్రధారిణిగా గుర్తింపుపొందింది. నటి కూడా. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తెలుగు రాజకీయాల్లో ఈమె సంచలనంగా మారింది. అనేక మంది ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అలా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన తారా చౌదరి.. ఇపుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. బావ వరుసయ్యే ఓ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడంటూ పోలీసు మెట్లెక్కింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

హైదరాబాద్, జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో తారా చౌదరి (31) ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనకు బావ వరుసయ్యే చావ రాజ్‌కుమార్ అనే వ్యక్తి మోసం చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్‌కుమార్ సోదరి సుజాత కారణంగా అతనితో మంచి పరిచయం ఏర్పడినట్టు చెప్పుకొచ్చింది.

సోదరుడు రాజ్‌కుమార్‌ను పెళ్లి చేసుకోవాలని తనను సుజాత కోరిందనీ, కానీ తాను మాత్రం అతనికి వివాహమైంది కదా అని ప్రశ్నించగా, లేదు విడాకులు ఇవ్వబోతున్నాడు ఎలాంటి సమస్యా ఉండదని సుజాత నమ్మించిందని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది.

అయినప్పటికీ రాజ్‌కుమార్‌ను తాను ఇష్టపడలేదని చెప్పింది. ఆ తర్వాత తాను హైదరాబాద్‌ను వీడి విజయవాడకు వెళ్లగా, అక్కడకు కూడా రాజ్‌కుమార్ వచ్చి తనను పలు రకాలుగా వేధించాడని ఆరోపించింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, అతను తప్పించుకుని తిరుగుతూ తనను వేధిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :