సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (13:28 IST)

నిర్మాత దగ్గుబాటి సురేష్ మద్యం సేవించి కారు నడిపారా?

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక బైక్ రాంగ్ రూట్లో దూసుకురావడంతో ప్రమాదం జరిగింది. సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్‌బాబు కారులో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ వైపుగా ప్రయాణిస్తుండగా రాంగ్ రూట్లో సడెన్‌గా ఓ బైక్ దూసుకొచ్చింది. దీంతో ఆయన కారు.. బైక్‌ను ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
అయితే, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన సమయంలో కారును సురేష్ బాబు స్వయంగా నడుపుతున్నారని, కారు వేగం గంటకు 100 కిలోమీటర్లకు పైగానే ఉందని పోలీసులు చెబుతున్నారు. కారు ప్రమాదానికి గురికాగానే, స్థానికుల సాయంతో క్షతగాత్రులను ఆయనే ఆసుపత్రికి పంపించారని, కారును పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చి అప్పగించి, విషయం చెప్పి, వ్యక్తిగత పూచీకత్తుపై వెళ్లారని కార్కానా పోలీసులు వెల్లడించారు. 
 
పైగా, ఈ ప్రమాదానికి సంబంధించి ఆయన స్టేట్మెంట్‌ను సైతం నమోదు చేశామని, సాయంత్రం తిరిగి విచారణకు రావాలని కోరామని, దగ్గుబాటి మద్యం తాగి వాహనం నడిపారా? అన్న విషయాన్ని తేల్చేందుకు రక్త పరీక్షలు చేయిస్తామని తెలిపారు.