మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (15:27 IST)

కోతులపై కేసు పెట్టండి.. అవేం చేశాయో తెలుసా?

కోతులు మనుషులపై పడితే కరవడం, లేదా రక్కుతాయి. అయితే యూపీలోని కోతులు మాత్రం డిఫరెంట్‌గా రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కోతులపై కేసు నమోదు చేయాలని మృతుడి బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీలోని బాగ్‌పత్ జిల్లా టిక్రీ గ్రామానికి చెందిన ధర్మపాల్ సింగ్ (72) వంట చెరకు కోసం.. అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఆయన్ని గమనించిన కోతులు గుంపు రాళ్లతో ఒక్కసారిగా ఆయనపై దాడికి తెగబడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ధర్మపాల్ సింగ్ రక్తసిక్తమై ఇంటికి చేరుకున్నారు. 
 
దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ధర్మపాల్ సింగ్‌ను చంపిన కోతులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే తమ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు.