శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (11:06 IST)

కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని తీసుకుంటే?

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. క

కొబ్బరి పువ్వు లోపలి భాగాన్ని పెరుగుతో కలుపుకుని ప్రతిరోజూ సేవిస్తే మూత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. కొబ్బరి చూర్ణాన్ని నీటిలో వేసి మరిగించుకుని కషాయం రూపంలో తీసుకుంటే కడుపులోని మంటను తగ్గిస్తుంది. కొబ్బరిలో ఔషధగుణాలు చాలా ఉన్నాయి. ఈ కొబ్బరి చూర్ణం శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది.
   
 
కొబ్బరి నీరు శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేయుటకు ఉపయోగపడుతాయి. నేత్ర సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. కొబ్బరి పెంకు నుండి తయారుచేసిన తైలంతో మర్దన చేసుకుంటే పలు రకాల చర్మ వ్యాధులు తొలగిపోతాయి. కొబ్బరి పాలు వీర్యవృద్ధిని కలిగిస్తాయి. కొబ్బరి పాలలో పటిక బెల్లం కలుపుకుని ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.