మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 12 సెప్టెంబరు 2018 (12:31 IST)

మెంతుల మిశ్రమంలో నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?

మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, కే, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతుల్లో గల పోషకాలు జుట్టు భిన్నంగా పనిచేసి వెంట్రుకలను కాంతివంతంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.

మెంతుల్లో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ ఏ, కే, సి, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మెంతుల్లో గల పోషకాలు జుట్టు భిన్నంగా పనిచేసి వెంట్రుకలను కాంతివంతంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. మెంతులను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి.
 
ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు పెరగడంతో పాటు కాంతివంతంగా మారుతుంది. మెంతుల మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోయి జుట్టు రాలడం తగ్గుతుంది. 
 
మెంతుల మిశ్రమంలో కొబ్బరిపాలను కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.