శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (16:36 IST)

రాళ్ల ఉప్పు బరువును తగ్గిస్తుందట.. తెలుసా?

రాళ్ల ఉప్పును ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాళ్ల ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారానికి రుచిని ఇచ్చే ఉప్పు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. కాన

రాళ్ల ఉప్పును ఉపయోగించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాళ్ల ఉప్పు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారానికి రుచిని ఇచ్చే ఉప్పు ఆరోగ్యానికి మేలుచేస్తుంది. కానీ రోజుకు ఓ స్పూన్ మోతాదు మించకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ ఒక స్పూన్ కంటే మోతాదుకు మించి ఉప్పును తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతోంది. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయి. 
 
ఇక శుద్ధీకరించబడిన అంటే ఐయోడైజ్, సాల్ట్ కంటే రాళ్ళ ఉప్పును ఉపయోగించడం ద్వారా శరీరానికి కావలసిన ధాతువులు లభిస్తాయి. శుద్ధీకరించబడిన ఉప్పులో ఈ ధాతువులు మాయమవుతాయి. సాల్ట్ ఉప్పు తెలుపు రంగులో రావాలని పలుమార్లు శుద్ధీకరించడం జరుగుతుంది. అలా శుద్ధీకరించినప్పుడు అందులోని ధాతువుల శాతం తగ్గిపోతుంది. శుద్ధీకరించేటప్పుడు ఇంకొన్ని రసాయనాలు కూడా చేర్చడంతో అవి ఆరోగ్యానికి అంతగా మేలు చేకూర్చవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
అయితే రాళ్ల ఉప్పులో ఎలాంటి రసాయనాలుండవు. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే శుద్ధీకరించబడిన ఉప్పులో వుండే రసాయనాలు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. కానీ రాళ్ల ఉప్పులోని పోషకాలు.. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించేందుకు సహకరిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గించడంలో రాళ్ల ఉప్పు భేష్‌గా తగ్గిస్తాయి. రాళ్ల ఉప్పులోని ధాతువులు.. వ్యాధినిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. 
 
రాళ్ల ఉప్పు శరీర వేడిని తగ్గిస్తుంది. ఇందులో వుండే పొటాషియం రక్తపోటును అదుపులో వుంచుతుంది. వాత సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. పెయిన్ కిల్లర్‌గా రాళ్ల ఉప్పు పనిచేస్తుంది. కండరాల్లో నొప్పి తీవ్రతను తగ్గించడంలో రాళ్ల ఉప్పు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.