శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:30 IST)

నడుము నొప్పితో బాధపడుతుంటే అసౌకర్యంలేని భంగిమలే బెస్ట్

చాలామంది దంపతులు నడుంనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారి దాంపత్య జీవితంలో కొంతమేరకు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. ఫలితంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తే ఆస్కారం లేకపోలేదు.

చాలామంది దంపతులు నడుంనొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటివారి దాంపత్య జీవితంలో కొంతమేరకు అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. ఫలితంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు కూడా తలెత్తే ఆస్కారం లేకపోలేదు. అయితే, నడుం నొప్పికి ప్రధాన కారణం ఎక్కువ సమయం కూర్చొని పని చేయడం వల్ల వస్తుందని వైద్యుల అభిప్రాయంగా ఉంది.
 
నిజానికి నడుము నొప్పి కారణంగా లైంగిక జీవితానికి దూరమవుతున్నారని చెప్పడం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకుసాగడం ఉత్తమం. ముఖ్యంగా, పని ఒత్తిడి వల్ల తలెత్తే నడుము నొప్పికి వేడి నీటి స్నానం, మర్దన, నొప్పి తగ్గించే క్రీములు వాడటం వల్ల కొంత ఫలితం కూడా ఉంటుంది. 
 
కొందరిలో శారీరకంగా కలిసే సమయంలో నడుంనొప్పి పెరుగుతుంది కూడా. అందువల్ల ఇద్దరికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేని భంగిమలను ఎంచుకోవడం ఉత్తమం. పైగా, భర్త నడుము మీద ఒత్తిడి పడని భంగిమలైతే ఇద్దరూ సమంగా లైంగిక జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. మరీ ముఖ్యంగా భర్త కింది భాగంలో భార్య పైభాగంలో ఉండి చేసే భంగిమలను అనుసరించినట్టయితే దంపతులకు ఎలాంటి సమస్యా ఉండదు.