మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : సోమవారం, 17 సెప్టెంబరు 2018 (13:56 IST)

బేకిండ్ సోడా వేసుకుని స్నానం చేస్తే..?

శరీరంలో నుండి విషాలను వెళ్లగొట్టి, హార్మోన్ల కారణంగా పెరిగిన ఒత్తిడిని తగ్గించి, శరీరంలోని పిహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే స్పా ట్రీట్మెంట్ కోసం ఖరీదైన స్పా సెంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. దీనికోస

శరీరంలో నుండి విషాలను వెళ్లగొట్టి, హార్మోన్ల కారణంగా పెరిగిన ఒత్తిడిని తగ్గించి, శరీరంలోని పిహెచ్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేసే స్పా ట్రీట్మెంట్ కోసం ఖరీదైన స్పా సెంటర్లకు వెళ్లవలసిన అవసరం లేదు. దీనికోసం వారానికోసారి 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది.
 
స్నానపు తొట్టి నిండా వేడి నీళ్లు నింపుకుని ఆ నీటిలో కొద్దిగా ఉప్పు, ల్యావెండర్ ఆయిల్, అరకప్పు బేకింగ్ సోడా కలుపుకుని 20 నిమిషాల పాటు ఆ నీటిలో విశ్రాంతి తీసుకోవాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన మానసిక, శారీరక ఒత్తిడి తొలగిపోతుంది.
 
మెడ వరకు నీళ్లలో మునిగి ఉండడం వలన గుండెకు వ్యాయామం అందుతుంది. తొట్టి స్నానంతో పొందే స్వాంతన వలన నిద్రలేమి తొలగిపోయి కమ్మని నిద్ర పడుతుంది. వేడి నీళ్ల వలన కండరాలు ఉపశమనం పొందుతాయి. దీని ఫలితంగా నిద్ర ఆవహిస్తుంది. వ్యాయామం ద్వారా కండరాలు, కీళ్ల నొప్పులు తొలగిపోతాయి.