గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (17:49 IST)

కడుపులో తన్నాడు.. అసభ్యంగా మాట్లాడారు.. దునియా విజయ్‌పై కేసు పెట్టిన కుమార్తె

కన్నడ హీరో దునియా విజయ్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై 19 యేళ్ల కుమార్తె మోనిక కేసు పెట్టింది. తనను కడుపులో తన్నడమే కాకుండా, అసభ్యంగా దుర్భాషలాడాడంటూ తండ్రిపై కేసు పెట్టింది. దీంతో ఆయన చిక్కుల్లో పడినట్టయింది. ఈ మేరకు ఫోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో తన దుస్తులు, డ్రైవింగ్ లైసెన్సు, ఇతర పత్రాలు తెచ్చుకునేందుకు తాను తన తండ్రి ఉన్న ఇంటికి వెళ్ళాను. అక్కడే ఉన్న తన తండ్రి దునియా విజయ్, ఆయన మిత్రుడు, డ్రైవర్ తనపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. 
 
'ఆయన (విజయ్) నాపై దుర్భాషలాడుతూ, అసభ్యంగా తిట్టారు. నాన్న, ఆయన మిత్రులు కృతి గౌడ, హేమంత్ చెప్పలేని మాటలతో తిడుతూ ఏది అందితే దాంతో కొట్టారు. నాన్న పలుమార్లు నన్ను తన్నడంతో పాటు పదేపదే నా తలను గోడకేసి మోదారు' అని మోనికి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో దునియా విజయ్‌తో పాటు.. ఆయన డ్రైవర్, మిత్రుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 
 
కాగా, దునియా విజయ్ మొదటి భార్య నాగరత్న కుమార్తె మోనిక ఇటీవల తన తండ్రి నుంచి విడిపోయింది. ఓ కేసులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని విజయ్ బలవంతం చేయడంతోనే తాను విడిపోయినట్టు ఆమె వాదిస్తోంది. అయితే నాగరత్న, కుమార్తె మోనిక కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విజయ్ చెబుతున్నాడు.