ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో విషాదం.. ఎందుకంటే...

Chandrababu
Last Updated: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (11:22 IST)
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన మేనల్లుడు ఉదయ్ కుమార్ (43) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. ఆయనకు ఛాతినొప్పి రావడంతో హుటాహుటిన హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ఉదయ్ కుమార్ ఎవరంటే... చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు. మేనల్లుడి వార్త తెలుసుకున్న చంద్రబాబు దిగ్భ్రాంతికి గురయ్యారు. తన మేనల్లుడు చివరి చూపుకోసం ఆయన అమరావతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరినట్టు సమాచారం.దీనిపై మరింత చదవండి :