గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (16:58 IST)

కేసీఆర్ ఇచ్చే గిఫ్టు కోసం ఎదురు చూస్తున్నా : చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనకేదో గిఫ్టు ఇస్తారట.. దాని కోసం ఎదురు చూస్తున్నా అంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. మంగళవారం ఎన్నికల ఫలితాల అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానంటూ చేసిన కామెంట్స్‌పై చంద్రబాబు స్పందించారు. 
 
ప్రకాశం జిల్లా పర్యటనతో చంద్రబాబు మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంతి ఏదో అంటున్నాడు... ఇక్కడకు వచ్చి నాకేదో గిఫ్ట్ ఇస్తానని అంటున్నారని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం... ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు... కొంత మంది బెదిరిస్తుంటారు... కానీ, తెలుగు దేశం పార్టీ పద్ధతి ప్రకారం పనిచేస్తోందన్నారు. 
 
మంగళవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎక్కడా గెలిచే పరిస్థితి లేకుండా పోయిందన్న చంద్రబాబు... గత ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మోడీ అన్యాయం చేశారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పోరాడుతుంటే సీబీఐ, ఈడీ, ఐటీ ద్వారా దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
 
బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చామన్నారు. కేంద్రం చేసే తప్పుడు పనులు చూడలేకే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.