శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (13:03 IST)

మళ్లీ మాదే అధికారం.. నేనే ముఖ్యమంత్రిని : కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మళ్లీ తమ పార్టీకి పట్టం కట్టనున్నారనీ తాను మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం జరుగుతున్న రాష్ట్ర ఎన్నికల పోలింగ్‌లో భాగంగా, ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసేందుకు కేసీఆర్ సతీసమేతంగా చింతమడక గ్రామానికి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో కేసీఆర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, 'తెరాసకు పూర్తి చాలా అనుకూల పవనాలున్నాయి. పవనాలు రోజు మారవు. మంచి ఫలితాలుంటాయి. రాష్ట్రంలో పోలింగ్ శాతం భారీగా ఉండబోతోంది. హైదరాబాద్‌‌ నగరంలోనూ ఇదే పరిస్థితి ఉంది. వృద్ధులు కూడా ఓటు వేసేందుకు ఆస్తకి కనబరుస్తూ పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. అంతా సానుకూలంగా ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కూడా తమ పార్టీకే అనుకూలంగా ఉంటుదనే విషయం తేటతెల్లమవుతుందని' అని ఆయన చెప్పారు.