బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2018
Written By
Last Updated : శుక్రవారం, 7 డిశెంబరు 2018 (11:27 IST)

ఓటేస్తే స్వీటు.. పువ్వు.. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు పూలతో స్వాగతం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరుగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 
 
అయితే, ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు రెడ్ తివాచీపరిచి స్వాగతం పలికారు. మరికొన్ని కేంద్రాల్లో పూలతో స్వాగతించారు. ఇంకొన్ని కేంద్రాల్లో స్వీట్లు పంచి ఓటర్లను ఆహ్వానించారు. 
 
రామగిరిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఓటు వేయడానికి వచ్చిన వారికి అధికారులు స్వీట్లు, పూలను పోలింగ్ కేంద్ర సిబ్బంది అందిస్తున్నారు. అంతేగాకుండా పోలింగ్ కేంద్రాన్ని పూలతో అత్యంత ఆకర్షణీయంగా అలంకరించారు. దీనితో ఈ పోలింగ్ కేంద్రం అందర్నీ ఆకట్టుకొంటోంది. 
 
శుభకార్యం జరిగితే ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో.. అలాంటి ఏర్పాట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం విశేషం. దీనిపై పోలింగ్ సిబ్బంది స్పందిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సఖీ పేరిట పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ మహిళా సిబ్బంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు, అయితే, స్త్రీపురుషులు ఇద్దరూ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ కేంద్రానికి ఓటు వేసేందుకు వచ్చే వారికి స్వీటుతో పాటు పూలు ఇస్తున్నట్టు తెలిపారు.