శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 4 డిశెంబరు 2018 (19:50 IST)

అవి వుంటేనే శృంగారం చేస్తున్నాడు... ఎందుకని...?

ఇటీవలే నాకు వివాహమైంది. మావారికి నేనంటే అమితమైన ఇష్టం. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినప్పటికీ... నామీద చాలా ప్రేమ చూపిస్తున్నారు. అయితే, అతి కొద్దికాలంలోనే ఆయనలో ఉన్న ఒక వీక్నెస్‌ను గమనించాను. అదేంటంటే... మల్లెపూలు పెట్టుకుంటేనే శృంగారం చేస్తున్నారు. పూలు పెట్టకుండా వుంటే పట్టించుకోవడంలేదు. ఆయన మితభాషి కావడంతో నేను కూడా చొరవచూపించలేక మిన్నకుండిపోయాను. రోజూ మల్లెపూలు దొరక్కపోవడంతో పెరట్లో ఉన్న సన్నజాజిపూలు కోసి మాలగా చేసి పెట్టుకున్నా. 
 
ఆ రోజు రాత్రి మరోమారు శృంగారంలో స్వర్గం చూపించారు. మరుసటి రోజు పూలు పెట్టుకోకుండా వుండటంతో ఆయనలో ఎలాంటి స్పందనా లేదు. ఇంకోరోజు పూలు పెట్టుకోకుండా పెర్ఫ్యూమ్ చల్లుకుని పడకగదిలోకి వెళ్లా. బెడ్‌పై చేరీచేరగానే వెంటనే ఆ రాత్రంతా శృంగారం చేశారు. అంటే నేను గమనించినదాని ప్రకారం ఆయన పూలు పెట్టుకోవడం లేదా పెర్ఫ్యూమ్ చల్లుకుంటేనే శృంగారం చేస్తున్నారు. లేదంటే ఆయనలో ఎలాంటి చలనమూలేదు. ఇదేమైనా వింత జబ్బా. ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థంకావడం లేదు. ఏం చేయాలి? 
 
సాధారణంగా పూలు, పెర్ఫ్యూమ్‌లు కోరికలను మరింతగా పుట్టిస్తాయి. ఎందుకంటే సుంగధపరిమళాలకు ఆ శక్తి ఉంది. అందుకే పూలు పెట్టుకున్నా లేకా పెర్ఫ్యూమ్ చల్లుకున్నా పురుషుల్లో ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది. అందువల్ల ఆయనకు ఇష్టమైన విధంగా ఎంజాయ్ చేయడమే ఉత్తమైన మార్గం.