శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రార్థన
Written By Kowsalya
Last Updated : గురువారం, 4 అక్టోబరు 2018 (15:46 IST)

శుక్రవారం రోజున స్త్రీలు ఈ పువ్వులు పెట్టుకుంటే..?

లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు.

లక్ష్మీదేవి ధనధాన్యాలు ఇచ్చేవారు. ఈ అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెబుతున్నారు. అలానే కార్తీక మాసంలో వచ్చే శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం అష్టైశ్వర్యాలు చేరువవుతాయని చెబుతున్నారు. ఈ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ధవళ వస్త్రాలు ధరించాలి.
  
 
శుక్రవారం రోజున ఉపవాస దీక్షను చేపట్టి అమ్మవారిని పూజించాలి. స్త్రీలు ఈ రోజున తెల్లపువ్వులు, కుంకుమ రంగు పువ్వులను పెట్టుకుని లక్ష్మీదేవిని పూజించడం వలన వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని భక్తులు విశ్వాసం. ఈ పువ్వులను లక్ష్మీదేవిని సమర్పించి ఆరాధించడం వలన కోరిక కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.