గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By
Last Updated : సోమవారం, 15 అక్టోబరు 2018 (12:58 IST)

బతుకమ్మ ఆటతో దీర్ఘసుమంగళీ ప్రాప్తం... ఎలా?

తెలంగాణలో సుప్రసిద్ధ పండుగ అయిన బతుకమ్మను రోజూ ఆడుతారు. ఏ రోజుకు ఆ రోజు బతుకమ్మను అలంకరించి నిమజ్జనం చేస్తారు.

తెలంగాణలో సుప్రసిద్ధ పండుగ అయిన బతుకమ్మను రోజూ ఆడుతారు. ఏ రోజుకు ఆ రోజు బతుకమ్మను అలంకరించి నిమజ్జనం చేస్తారు. అన్ని రోజులూ బతుకమ్మ ఆడటం కుదరని వారు.. దుర్గాష్టమి రోజున తప్పకుండా బతుకమ్మ ఆడుతారు. ఆపై బతుకమ్మను దగ్గర్లోని చెరువు లేదా నదిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ నిమజ్జనం తర్వాత దసరా పండుగ జరుపుకుంటారు. 
 
బతుకమ్మ పూజల సందర్భాన్ని పురస్కరించుకుని ఆడపడుచులు పుట్టింటికి వెళ్ళడం ఆనవాయితీగా వస్తోంది. ఐదు రకాల పువ్వులతో అందంగా తయారైన బతుకమ్మకు పూజలు చేస్తారు. బంతి, చేమంతి వంటి పుష్పాలతో బతుకమ్మను అందంగా తయారుచేస్తారు. ముఖ్యంగా తంగేడు, గునగ పూలు, ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఒక విశాలమైన పళ్ళెంలో రంగురంగుల పూలను ఒక క్రమపద్ధతిలో పేరుస్తారు. 
 
పసుపుముద్దతో రూపొందించిన గౌరీదేవిని కూడా పళ్ళెంలో ఉంచుతారు. ఈ బతుకమ్మను పూజామందిరంలో ఉంచి పూజ చేసిన తర్వాత వెలుపల ఖాళీ ప్రదేశంలో వుంచి ఆ బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడుతారు. పేలపిండి, బెల్లం, పిండివంటలతో కూడిన వాయనాలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఇలా బతుకమ్మ పండగను ప్రతీ ఏటా జరుపుకునే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని పండితులు చెప్తున్నారు.