మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 23 అక్టోబరు 2018 (14:44 IST)

శృంగారపరమైన కోర్కెలను పెంచే మల్లెపువ్వులు..

మల్లె పువ్వులతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మెరిసిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. గుప్పెడు మల్లె పువ్వుల్ని నూరి ముద్దచేసి కొద్దిగా పాలు కలిపి ముఖమంతా మర్దన చేసుకొని ఆ తర్వాత అరచెంచా చొప్పున ముల్తానామట్టి, గంధం, తేనె కలిపి పేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం తాజాగా మారి మెరిసిపోతుంది. మత్తెక్కించే మల్లెపూల వాసన నాడీవ్యవస్థను ప్రేరేపించి శృంగారపరమైన కోర్కెలను పెంచుతుంది. 
 
మల్లెపువ్వుల్ని వేడి నీటిలో వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే.. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. పువ్వుల సువాసన కారణంగా మానసిక ఆహ్లాదం చేకూరుతుంది. రోజంతా బయట తిరగడం వల్ల ఒత్తిడికి లోనైన కళ్ళమీద విరిసిన మల్లెలను ఉంచితే ఆ ఒత్తిడి తొలగిపోతుంది. చుండ్రు బాధితులు మెంతులు, ఎండుమల్లెలు కలిపి నూరి తలకు పట్టిస్తే సమస్య తగ్గడమే కాక జుట్టు పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
 
మల్లెలను కొబ్బరినూనెలో వేసి రాత్రంతా నానబెట్టి, ఆ తర్వాత మరగనిచ్చి ఆ నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టు ఆరోగ్యంగా పెరగటమే గాక మాడు చల్లబడుతుంది. రెండు చెంచాల చొప్పున మల్లెపూల రసం, గులాబీ పువ్వుల రసం, గుడ్డు పచ్చసొన కలిపి ముఖానికి రాస్తే ముఖ చర్మం మెత్తబడి కాంతివంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.