శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 22 అక్టోబరు 2018 (19:21 IST)

చింత చిగురును పేస్టులా చేసి అక్కడ రాసుకుంటే...

మనం ప్రతిరోజు సహజంగానే రకరకాల ఆకుకూరలు తింటూ ఉంటాం. వీటి వలన చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చింతచిగురులో శరీరానికి అవసరమైన చాలా రకాల పోషకాలు ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వాటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. నేత్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు చింతచిగురును తరచూ వాడటం వలన కళ్లు దురదలు తగ్గిపోయి కళ్లు తేజోవంతంగా కనిపిస్తాయి.
 
2. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింతచిగురు బాగానే పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్టెరాల్‌ను పెంచుతుంది.
 
3. చలి జ్వరం తగ్గాలంటే చింతచిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతుంది.
 
4. చింతచిగురు గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
 
5. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
 
6. చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
 
7. డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చింతచిగురును వాడటం మంచిది. ఎందుకంటే ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
 
8. చింత చిగురును పేస్టులా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.
 
9. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.