శుక్రవారం, 15 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (13:47 IST)

అత్తిపండును అలా వాడితే పురుషులు శృంగారంలో...

అత్తి పండు తియ్యని రుచి గల పండు.. ఈ పండు రక్త పుష్టి కలిగిస్తుంది. అరోగ్యానికి మేలు కలిగిస్తుంది. దీనిలో మాంసకృత్తులు, కొవ్వు, పిండి పదార్థాల వంటివి స్వల్ప మోతాదులో ఉంటాయి. అత్తి పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి.
 
ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో 50 నుంచి 75 శాతం వరకూ ఉంటుంది. దీనిని నేరుగా గాని, లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి గాని తీసుకోవచ్చు. పిండి పదార్థాలను తీసుకోవటం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే, ఆ పదార్థాలతోపాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది. అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు. అత్తిపండ్లను కేకుల తయారీలోను, జామ్‌ల తయారీలోనూ వాడతారు. దీనిని దీర్ఘవ్యాధులనుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు. 
 
అత్తిపండులోని ఆరోగ్యప్రయోజనాలు...
 
అత్తి పండ్లను వాడబోయే ముందు బాగా కడగాలి. ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది. నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది. అయితే, దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి. కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతో సహా తీసుకోవాలి.
 
అత్తిపండ్లు శృంగార వాంఛను కలిగించి, శృంగారంలో పాల్గొనే వారికి నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి. వీటిని నేరుగా గాని లేదా బాదం, ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతోగాని వాడుకోవచ్చు. వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది.
 
మలబద్ధకం: అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది. అలాగే దీనిపైన గట్టి తోలు ఉంటుంది. వీటివల్ల, వీటిని మలబద్ధకంతో బాధపడేవారు వాడవచ్చు. 
 
అత్తిపండ్లలో ఉండే చిన్నచిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలబద్దక సమస్య తగ్గుతుంది. అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది.
 
కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది. ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది. అలుపు, అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.