గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Modified: శనివారం, 20 అక్టోబరు 2018 (22:20 IST)

వారానికి ఎన్ని గ్రాముల పిస్తా పప్పులు తినవచ్చో తెలుసా?

పిస్తా పప్పులు ఈమధ్య కాలంలో చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. ఐతే పిస్తాలో మోనో శాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్నందువల్ల వీటిని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. వారంలో 15-20 గ్రాములకు మించి తినడం మంచిది కాదని న్యూట్రీషియన్లు అంటున్నారు. బాదంపప్పుతో కూడిన నట్స్ కంటే పిస్తాల్లో పోషక పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. 
 
పిస్తా పప్పుల్లో పోటాషియమ్ అత్యధికంగా లభిస్తుంది. శరీరంలో ద్రవాల నియంత్రణకు పొటాషియమ్ బాగా పనికొస్తుంది. దీనిలో ఉండే విటమిన్ బి6 ప్రోటీన్ల తయారీ, శోషణంలో ఉపయోగపడుతుంది. మిగిలిన ఎండు పండ్లతో పోలిస్తే కాలరీలు తక్కువ. ఇవి గుండెజబ్బులను తగ్గించే గుణం కలిగినవి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ విశేషంగా ఉంటాయని న్యూట్రీషన్లు అంటున్నారు.