మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Modified: శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:26 IST)

అల్లం, పసుపు గురించి బాగా తెలిస్తే మెడికల్ షాపుకు వెళ్లరంతే...

మన ఇంటిలో వాడే పసుపు, అల్లంలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్స్ లక్షణాలున్నాయి. ఈ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తెగిన చిన్న గాయాలు, కాలిన గాయాలపై వెంటనే పసుపు చల్లడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది. 
 
ఇది సాధారణ జలుబు, కీళ్ళ నొప్పులు, ఆర్ధరైటిస్, స్కిన్ బర్న్, మొటిమలు, మచ్చలు, కడుపుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలను నివారిస్తుంది. ఇది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల లేదా రెగ్యులర్‌గా పెయిన్ కిల్లర్స్‌ను తీసుకోవడం వల్ల లివర్ డ్యామేజ్ లక్షణాలను నివారిస్తుంది. పసుపు వాడకం వల్ల వివిధ రకాల బ్రెస్ట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కణాలపై పోరాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ, యాంటీస్పాస్మోడిక్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. 
 
అల్లంలో పొటాషియం, మెగ్నీషీయం, మ్యాంగనీస్, ఫాస్పరస్, జింక్, మరియు విటమిన్ ఎ, సి, ఇ, బికాంప్లెక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అల్లంను స్టొమక్ అప్‌సెట్, అజీర్ణం, హార్ట్ బర్న్, వికారం, బాడీ పెయిన్, ఆర్థరైటిస్ పెయిన్, జలుబు, దగ్గు, ఇతర శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలను, ఫీవర్ మరియు పీరియడ్స్‌లో తిమ్మెర్లను నివారించడానికి సహాయపడుతుంది.