పాలు, పెరుగుతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?
మెుటిమలు, నల్లమచ్చలు తొలగిపోవడానికి ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చును. కీరదోస మిశ్రమంలో కొద్దిగా గుడ్డు తెల్లసొన, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది.
పాలలో కొద్దిగా శెనగపిండి, పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే కొబ్బరినూనెను చర్మానికి రాసుకోవాలి. అరగంట తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.
కీరదోస రసంలో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన అలసట, ఒత్తిడి తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.