గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:52 IST)

నా గర్ల్ ఫ్రెండ్ నాకలా చేస్తూ నన్ను తెల్లవార్లూ నిద్రపోనివ్వడం లేదు...

మేమిద్దరం ప్రేమికులం. ఎలాగోలా పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి మరో 6 నెలలు తర్వాత పెళ్లాడాలనుకుంటున్నాం. ఐతే అప్పటిదాకా ఇద్దరం శృంగారం చేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఓ రోజు ఇద్దరం శృంగారానికి సన్నద్ధమయ్యాం. కానీ నాకు చమట్లు పట్టి భయం వేసింది. దానితో అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఇక అప్పట్నుంచి నాలో ఏదో లోపమున్నదేమోనని నా గర్ల్ ఫ్రెండ్ అనుమానపడుతోంది. వైద్యుడికి చూపించుకోమంటూ రోజూ ఫోన్లు చేసి నిద్రపోనివ్వడంలేదు. నిజంగానే లోపముందంటారా?
 
పెళ్లి కాక ముందే ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు తెలియని భయంతో చాలామంది పురుషులు లేదంటే స్త్రీలు కూడా వణికిపోతారు. దీనికి కారణం పెళ్లికాకుండా ఇలాంటివాటిలో పాల్గొంటే పరిణామాలు ఎలా వుంటాయోనన్న భయం. ఆ భయంతోనే మీరు కూడా నీరుగారిపోయి వుంటారు. ఆందోళన చెందాల్సిందేమీ లేదు. పెళ్లి తర్వాత అన్నీ సర్దుకుంటాయి. కాబట్టి అప్పటివరకూ ఆమెను ఆగమని సర్ది చెప్పండి.