ముగ్గురు టెక్కీలతో పాటు 50 మంది మహిళలపై అత్యాచారం.. ఆపై...
ఆ ఉన్మాది నయానా.. భయానో... బెదిరించో.. బుట్టలో వేసుకునో, లొంగదీసుకునే ఏవిధంగా అయితేనేం... ఏకంగా ముగ్గురు టెక్కీలతోపాటు ఏకంగా 50 మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా, అత్యాచారం చేసే సమయంలో వీడియో తీసేవాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరిస్తూ కొన్ని నెలల పాటు తన పైశాచికానందం పొందుతూ వచ్చాడు. చివరకు పోలీసులకు చిక్క కటకటాలపాలయ్యాడు.
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర శివారు ప్రాంతమైన అంబత్తూరులో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అరివళగన్ అనే మాజీ ఐటీ ఉద్యోగి మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిగా మారిపోయాడు. ఆ తర్వాత మహిళలను బెదిరించి అత్యాచారం చేస్తూ, ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో అరివళగన్ రికార్డు చేసేవాడు.
ఆ వీడియోలతో మహిళలను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్లపై లైంగిక అకృత్యాలకు పాల్పడుతూ వచ్చాడు. ఈ వ్యవహారంపై ఓ బాధిత గృహిణి, ముగ్గురు మహిళా ఉద్యోగినిలు మహిళా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం పోలీసులు.. ముమ్మర గాలింపు తర్వాత ఎట్టకేలకు ఆ కామాంధుడుని అరెస్టు చేశారు. అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, అందులో 50 మందికి పైగా మహిళలపై అత్యాచారం చేసిన వీడియోలు ఉండటాన్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు.