గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 డిశెంబరు 2018 (15:19 IST)

ఎంపీ పదవికి బాల్క సుమన్‌ రిజైన్ ... మంత్రి పదవి ఖాయమంటున్న నేతలు

లోక్‌సభ స్థానానికి బాల్క సుమన్ రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పైగా, ఈయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు. 
 
ఈ నేపథ్యంలో చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బాల్క సుమన్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు సోమవారం అందజేశారు. 
 
అదేసమయంలో ఆయనకు సీఎం కేసీఆర్ మంత్రివర్గంలో చోటుఖాయమనే ఊహాగానాలు వస్తున్నాయి. సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో బాల్క సుమన్ కూడా పాల్గొన్నారు.