మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 12 డిశెంబరు 2018 (09:16 IST)

రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే రాజీనామా.. మోడీకి థ్యాంక్స్

రాజస్థాన్ రాష్ట్ర అసంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చిత్తుగా ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవికి వసుంధరా రాజే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె ఆ రాష్ట్ర గవర్నర్‌కు అందజేశారు. 
 
ఎన్నిక‌ల్లో క‌ష్ట‌ప‌డిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, అవ‌కాశం క‌ల్పించిన ప్ర‌ధాని నరేంద్ర మోడీ, పార్టీ అధ్య‌క్షుడు అమిత్ షాకు ఆమె ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఆమె అభినంద‌న‌లు తెలిపారు. గ‌డ‌చిన అయిదేళ్ళ‌లో తాను ఎన్నో అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాన‌ని, వాటిని కాంగ్రెస్ ముందుకు తీసుకెళుతుంద‌న్న ఆశాభావాన్ని ఆమె వ్య‌క్తం చేశారు. 
 
కాగా, మంగళవారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 199 స్థానాలకు ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చాయి. అలాగే, బీజేపీకి 73, ఇతరులకు 27 సీట్లు వచ్చాయి. దీంతో అత్యధిక సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.