మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (17:27 IST)

మేము బట్టలు మార్చుకుంటూ వుంటే.. జవాన్లు తొంగి చూస్తున్నారని అంటారు..

మహిళలను ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్‌గా నియమిస్తే.. ఆరు నెలల పాటు యూనిట్‌ను వదిలి పెట్టకూడదని.. ప్రసూతి సెలవులకు అభ్యంతరం చెబితే.. పెద్ద అల్లరి జరుగుతుందని భారత సైన్యాధ్యక్షుడు జనరల్ బిపిన్ రావత్ అన్నారు. సైనిక రంగంలోని ఇంజనీరింగ్, మైనింగ్, డీమైనింగ్ విభాగాల్లో మహిళలు వున్నారని.. జనరల్ రావత్ తెలిపారు.
 
ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతున్నట్లుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్నందువల్ల మహిళలను పోరాటంలో ముందు వరుసలో నిలపలేదని చెప్పుకొచ్చారు. ఆయుధాలు పట్టి పోరాడే ఉద్యోగాలకు మహిళలు సిద్ధం లేరన్నారు. యుద్ధంలో ముందు వరుసలో వుండి పోరాడటం మహిళలకు అసౌకర్యంగా వుంటుందని.. తాము బట్టలు మార్చుకుంటూ వుంటే జవాన్లు తమను తొంగి చూస్తున్నారని అంటారని రావత్ వ్యాఖ్యానించారు.
 
మహిళలను పోరాట సంబంధ ఉద్యోగాల్లో నియమించేందుకు తాను సిద్ధమేనని, జవాన్లలో అత్యధికులు గ్రామీణులని, వారు ఓ మహిళా అధికారి తమకు నాయకత్వం వహించడాన్ని అంగీకరించకపోవచ్చునని చెప్పారు.