1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Dowry Harassment, women suicide with her two children

వరకట్న వేధింపులు... ఇద్దరు పిల్లలతో సహా బావిలో దూకిన మహిళ

Dowry Harassment
వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ తన ఇద్దరు పిల్లలతో సమీపంలోని పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కరణ్ కోర్టు రూరల్ సిఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం మల్కపూర్ గ్రామానికి చెందిన నందిగామ దేవమ్మ భర్త నందిగామా వెంకటేశులు గత నాలుగు సంవత్సరాల క్రితం కోట పిసిపల్లి గ్రామానికి చెందిన వడ్డే శాంతమ్మ కూతురితో వివాహం జరిగింది. 
 
నాలుగేళ్లపాటు కాపురం సాఫీగా కొనసాగినప్పటికీ వరకట్నం కింద తనకు కొంత డబ్బు తీసుకురావాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తాళలేక తల్లి, ఇద్దరు కూతుళ్లతో కలిసి బావిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు బావిలోకి దూకి రెండు సంవత్సరాల రాజేశ్వరి అనే పాపను రక్షించారు. చిన్న పాప, తల్లి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు.
 
వరకట్న వేధింపులతోనే తన కూతురు దేవమ్మ చిన్న పిల్లలతో ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి శాంతమ్మ కరణ్ కోట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు, చిన్నారి మరణానికి కారణమైన వెంకటేశ్‌ను ఆయన కుటుంబ సభ్యులను కఠిన శిక్షించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కరణ్ కోట్ ఎస్ఐ సంతోష్ కుమార్, సిఐ ఉపేందర్ తెలిపారు.
తర్వాతి కథనం
వాడితో పలుకుతోంది.. అందుకే చంపేశా : స్టాఫ్ నర్స్ హత్య కేసులో భర్త వాంగ్మూలం