శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 10 డిశెంబరు 2018 (16:33 IST)

శృంగారం చేయబోతుంటే తప్పించుకుంటోంది... ఈమెతో నావల్ల కాదేమో?

ఆమె అంటే నాకు ఎంతో ప్రేమ. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి జరిగి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇంతవరకూ మేము శారీరకంగా ఒకటి కాలేకపోయాము. ఇంతకాలంలో ఒక్కసారి కూడా ఆమె నన్ను దగ్గరికి రానివ్వలేదు. పైగా ఏదో ఒకటి చెపుతూ తప్పించుకుంటోంది. ఆమె అంటే నాకు ఎంతగానో ప్రేమ ఉన్నప్పటికీ ఇలా నా కోర్కెలను తీర్చుకోనివ్వకుండా దూరం పెట్టడాన్ని సహించలేకపోతున్నాను. ఆమెకు విడాకులు ఇచ్చి వేరే అమ్మాయిని పెళ్లాడాలని ఉంది. కుదురుతుందా...?
 
విడాకుల మాట అటుంచి ఆమె శృంగారం పట్ల విముఖత ఎందుకు చూపిస్తున్నదో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆమెలో గూడుకట్టుకుని ఉన్న భయాలను తొలగించాలి. అలా చేసినట్లయితే మీరు కోరుకున్న ఘడియలు వస్తాయనడంలో ఎంతమాత్రం అనుమానం లేదు. ఇకపోతే భర్త లేదా భార్య ఒకరికొకరుతో శారీరక సంబంధాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేకిస్తున్నట్లు రుజువు చేయగలిగితే జీవిత భాగస్వామి నుంచి చట్టప్రకారం విడిపోయే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో శారీరక సంబంధాన్ని తిరస్కరించడాన్ని కూడా కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది. ఆధారాలను ప్రవేశపెడితే, వాటిని పరిశీలించిన మీదట విడాకులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది.