శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Modified: సోమవారం, 10 డిశెంబరు 2018 (11:33 IST)

అక్క లేనప్పుడు గబుక్కున వచ్చి వాటేసుకుంటున్నాడు. ఇంకా ఏదేదో...

మా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మా అక్క, బావ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నా. అయితే, ఓ రోజున మా అక్క ఇంట్లోలేని సమయంలో మా బావ గట్టిగా కౌగిలించుకుని ముద్దుపెట్టుకున్నాడు. ఆయన పట్టు నుంచి నేను వదిలించుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. ప్లీజ్ నా కోర్కె తీర్చు... బాగా చదివిస్తాను, మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు. 

అయినప్పటికీ నేను అంగీకరించలేదు. ఐతే అక్క లేనప్పుడు గబుక్కున వచ్చి వాటేసుకుంటున్నాడు. ఇంకా ఏదేదో చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఐతే నేను ఎలాగో తప్పించుకుంటున్నాను. కానీ ఏదో ఒకరోజు నాపై అఘాయిత్యం చేస్తాడని భయంగా వుంది. ఏం చేయాలి?
 
అర్జెంటుగా ఆ ఇంటిని వదిలి మీ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోండి. లేనిపక్షంలో ఏదో ఒక రోజున మీరు అనుమానిస్తున్నట్లే జరుగుతుంది. డిగ్రీ పూర్తి చేశారు కాబట్టీ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ మీ తల్లిదండ్రులను పోషించుకోండి. ఆర్థిక పరిస్థితులను ఆసరా చేసుకుని కొంతమంది ఇలా ప్రవర్తిస్తుంటారు. జాగ్రత్తగా వుండాలి.