మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 14 డిశెంబరు 2018 (16:09 IST)

కాటుక ఎందుకు పెట్టుకోవాలి..?

ఆయుర్వేదం ప్రకారం కాటుక పెట్టుకోవడం వలన కళ్లకు చల్లదనం లభిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ధూళి కణాలు కళ్లలో పడకుండా కాటుక కాపాడుతుంది. అంతేకాదు కళ్లు ఎప్పుడూ తాజాగా, మెరిసేలా చేస్తుంది. కళ్లలో ఏర్పడే ఎర్రటి మచ్చలు కాటుక పెట్టుకోవడం వల్ల తగ్గిపోతాయి. కాటుక తయారీలో ఉపయోగించే పదార్థాలివే.. కాటుక ప్రమిద, ఆముదం, దూది, రాగి పాత్ర, గంధం, కర్పూరం ఉపయోగిస్తారు.
 
కాటుక అనేది స్త్రీలకున్న సుమంగళ ద్రవ్యములలో ఒకటి. స్త్రీలు వారి ఐదవతనాని కొరకు కాటుక పెట్టుకుంటారు. సూర్య కిరణాలు నేరుగా పడటం వలన కంటికి హాని కలుగుతుంది. కాటుక ధరించడం వలన కంటికి చలువ చేస్తుంది. కనుక సూర్య కిరణాలు పడినా కంటికి ఎటువంటి హాని కలుగదు. కాటుక యొక్క మహిమను శ్రావణమంగళవార నోములో తెలిపియున్నారు.
 
కాటుకని ధరించడానికి ముఖ్యమైన కారణం అందం. ప్రకృతిలో మనిషికి మాత్రమే నల్లటి కనుగుడ్డు చుట్టూతా తెల్లటి కంటిభాగం ఉంటుంది. దీనినే స్క్లెరా అంటారు. ఈ తెల్లటి భాగం వలన కనుగుడ్డు ఎటు కదులుతోందో.. మనిషి కళ్లు పలుకుతున్న భావాలు ఏమిటో.. తెలుస్తుంది. ఈ స్క్లెరా చుట్టూ కాటుకని రాయడం వలన కళ్లు పలికే భావాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అందుకనే భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలు చేసేవారు, తప్పకుండా కాటుకను ధరించి తీరతారు.