గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:39 IST)

చెరకు రసంతో ఫేషియల్ ఎలా..?

చెరకు రసం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. దాహాన్ని తగ్గిస్తుంది. చెరకు రసంలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి లవణాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతాయి. ఈ రసం అందానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. మరి ఆ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం..
 
చెరకు రసం ముఖానికి రాసుకుంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. ముఖం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. 
 
చెరకు రసంతో ఫేషియల్ ఎలాగంటే.. చెరకు రసాన్ని ముఖానికి రాసుకుని 10 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం కోమలంగా ఉంటుంది. అంతేకాదు.. ముఖం మీద మచ్చలు, మొటిమలు పోయి కాంతివంతంగా తయారవుతుంది.
 
పిగ్మెంటేషన్ వలన ఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. చెరకు రసంతో వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకోవడంతో పాటు రాత్రి వేళ పడుకోబోయే ముందు నైట్‌క్రీములు, క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.