గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శనివారం, 15 డిశెంబరు 2018 (13:24 IST)

టమోటా, పెరుగు ప్యాక్ వేసుకుంటే..?

చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిబారడం, ముడతలుగా మారడం వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలంటే.. ఈ టిప్స్ పాటించాలి. ఆరెంజ్ తొక్కల్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని నీటితో చేర్చి ముఖానికి, కాళ్లు, చేతులకు పట్టించి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
 
రెండు స్పూన్ల నిమ్మరసంలో ఒక గ్లాసు నీటిని చేర్చి.. కాసింత తేనెను చేర్చి పరగడుపున సేవిస్తే చర్మ సౌందర్యం మెరుగవుతుంది. అంతేకాకుండా బరువు తగ్గుతారు. ఆయిల్ స్కిన్ కలిగివుంటే రోజ్ వాటర్‌ను కాటన్‌లో తడిపి ముఖానికి పట్టిస్తే ఫలితం ఉంటుంది. 
 
మచ్చలు తొలగిపోవాలంటే టమోటా, పెరుగును చేర్చి ముఖానికి అప్లై చేసుకోవాలి. చర్మం పొడిబారకుండా వుండాలంటే వింటర్లో సున్నిపిండి రాసుకోవడం, కోల్డ్ క్రీములను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.