శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 13 డిశెంబరు 2018 (15:53 IST)

బరువుకు - చలికాలానికి లింకేంటి?

బరువు పెరగడానికి చలికాలానికి సంబంధం ఉందని కొందరు చెబుతుంటారు. కానీ సైంటిస్టులు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తుంటారు. అసలు బరువుకు చలికాలానికి ఉన్న సంబంధం శాస్త్రీయంగా నిరూపణకాలేదని వారు చెబుతుంటారు.
 
నిజానికి చలికాలం వస్తే చాలా మంది బరువు పెరుగుతారన్నది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే చలికాలంలో తీసుకునే ఆహారం భిన్నంగా ఉంటుంది. పైగా, ఇతర కాలాల్లో కంటే చలికాలంలో ఆహారం ఎక్కువగా తీసుకుంటారు. దీనివల్ల బరువు పెరుగుతారన్నది కొందరి అభిప్రాయంగావుంది. 
 
దీనిపై సైంటిస్టులను సంప్రదిస్తే, చలికి, బరువుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే, చలికాలంలో అతిగా తినరాదంటున్నారు. అలాగే, శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని వారు సూచన చేస్తున్నారు. అలాగే, తీసుకునే ఆహారానికి తగ్గట్టుగా బరువును నియంత్రణలో ఉంచుకోవాలని సలహా ఇస్తున్నారు. 
 
అదేసమయంలో కొంతమంది చలికాలంలో బరువు పెరుగుతారు. దీనికి కారణం బద్ధకం. చలికాలంలో శారీరక శ్రమ తగ్గించి, ఎక్కువ సమయం నిద్రపోతారు. ఇలా నిద్రపోవడంతో అతిగా ఆరగించడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఆహారం విషయంలో ఏమి తింటున్నామన్న దానిపై అవగాహనతో మెలగాలి. ఆరోగ్యకరమైన డైట్‌ తీసుకుంటే మంచిది. శీతాకాలంలో తినాల్సినవి తినకుండా వేరేవి తినడం వల్ల శరీరం బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. 
 
కడుపునిండా లాంగిస్తూ వ్యాయామాలు చేయకపోయినా లావెక్కుతారు. శీతాకాలంలో శరీర బరువుపరంగా కొందరిలో ఫ్లక్చుయేషన్స్‌ కూడా వస్తుంటాయి. హార్మోన్లలో వచ్చిన మార్పులతోపాటు కాలేయం దెబ్బతినడం వల్ల కూడా శరీర బరువులో తేడాపాడాలు కనిపిస్తుంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.