శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 10 డిశెంబరు 2018 (12:28 IST)

పొట్టలో పేరుకు పోయిన కొవ్వును తగ్గించేందుకు ఆ జ్యూస్ తీసుకుంటే..?

పొట్టలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలని చాలామంది నానా తంటాలు పడుతుంటారు. దీనికోసం ఆహారపు అలవాట్లను మార్చుకుంటారు. పొట్ట తగ్గడం కోసం తిండి కూడా మానేస్తుంటారు. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు.
  
 
బరువు తగ్గడం కోసమని నిమ్మకాయ రసాన్ని వేడినీటిలో కలుపుకొని తాగుతుంటారు. అయితే దీనికంటే కొత్తిమీర జ్యూస్ తాగితే 5 రోజుల్లో 5 కిలోల బరువు తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..
 
కొత్తిమీరను మిక్సీలో వేసి తగినంత నీరు పోసి జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా కలపాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవగానే ఈ జ్యూస్‌ తాగాలి.. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా పొట్టలో పేరుకున్న కొవ్వు కూడా తగ్గిపోతుంది. దాంతో పాటు శరీరానికి కావలసిన ఎనర్జీ కూడా లభిస్తుంది. ఆకలి నియంత్రణకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారు రోజుకో గ్లాస్ కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే ఫలితం ఉంటుంది.