శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 4 డిశెంబరు 2018 (12:59 IST)

మెంతులు నానబెట్టి ఇలా చేస్తే..?

మెంతులు ఎక్కువగా వంటకాల్లో వాడుతుంటారు. ఈ మెంతులకు భారతీయ వంటకాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచు ఆహారంగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో ఔషధ గుణాలు ఎక్కువ. మరి ఈ మెంతుల్లోని ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. మెంతులు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తాయి. తద్వారా రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. 
 
2. మధుమేహ వ్యాధితో బాధపడేవారు కొన్ని మెంతులను పొడి చేసుకుని అందులో కొద్దిగా తేనె లేదా చక్కెర కలిపి తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది. 
 
3. కప్పు మెంతులను రాత్రివేళ నానబెట్టుకుని ఉదయాన్నే వాటిని శుభ్రం చేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో కలిపి కొద్దిగా తేనె కలిపి తాగితే అల్సర్ వ్యాధి రాదు. 
 
4. మెంతులు కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. శరీరంలో ఎక్కువగా ఉండే కొలెస్ట్రాల్‌ నిల్వలను నియంత్రిస్తాయి. అధిక బరువు గలవారు గ్లాస్ మెంతులు నీరు తీసుకుంటే బరువు త్వరగా తగ్గుతారు.
 
5. నడుము నొప్పిగా ఉన్నప్పుడు మెంతులను నీటిలో మరిగించి ఆ నీటితో కాపడం పెట్టుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. మెంతులను నీళ్లలో కలిపి పైపూతగా లేదా పట్టుగా వాడితే ఇన్ఫెక్షన్స్, చీము పొక్కులు వంటి సమస్యలు పోతాయి.
 
6. గర్భిణిగా ఉన్న మహిళలు రోజూ మెంతులతో తయారుచేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే తల్లిపాలు వృద్ధి చెందుతాయి. పునరుత్పత్తి సమస్యల్లోనూ మెంతులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.