నారింజ తీసుకుంటే.. ఆ వ్యాధికి చెక్ పెట్టవచ్చు...
సాధారణంగా చాలామంది చలికాలంలో దొరికే ఏ పండ్లు తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది కాదని నమ్ముతుంటారు. కానీ ఈ కాలంలో దొరికే నారింజ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, నూట్రియన్స్ వంటి ఖనిజాలు శరీరానికి కావలసిన ఎనర్జీని అందిస్తాయి. నారింజలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. తప్పక దానికి తినాలనిపిస్తుంది.
ఈ కాలంలో ఎలాంటి తీపి పదార్థాలు తీసుకున్నా వాటి కారణంగా ఏర్పడే సమస్యలు తట్టుకోలేకపోతున్నాం. మరి నారింజ కూడా తీపి పదార్థమే.. కదా ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందని కొందరి మాట.. అందుకు నిదర్శనం నారింజలోని యాంటీ బ్యాక్టీరియల్, మినరల్స్ వంటి ఖనిజాలే.. ఎలాగంటే.. నారింజను మనం తీసుకున్నప్పుడు దానిలోని పోషకాలు శరీరంలో ప్రవేశించి శరీర వ్యర్థాలను బయటకు పంపుతాయి.
ఇలా జరిగినప్పుడు మన శరీరంలోని చెడు బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. తద్వారా ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. నారింజలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఆకలి నియంత్రణకు మంచి ఔషధంగా సహాయపడుతుంది. నారింజలోని పొటాషియం, మెగ్నిషియం వంటివి హైబీపీని అదుపులో ఉంచుతాయి. ఇంకా చెప్పాలంటే.. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నారింజ పండు రెగ్యులర్‌గా తీసుకునే వారికి కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. రాళ్లు మళ్లీ ఏర్పడకుండా ఉంటాయి. అలానే లివర్‌లోని మలినాలను తొలగిస్తుంది. అధిక బరువు కారణంగా చాలామంచి విపరీతమైన కొవ్వుతో బాధపడుతుంటారు. ఆ కొవ్వును కరిగించాలంటే.. రోజుకో నారింజ పండు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
నారింజలోని విటమిన్ సి క్యాన్సర్ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇటీవలే చేసిన ఓ పరిశోధనలో రోజూ నారింజ పండు తీసుకునే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. కనుక క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు.. నారింజతో తయారుచేసిన జ్యూస్ లేదా ఆహార పదార్థాలు తీసుకుంటే వ్యాధి తగ్గుముఖం పడుతుంది.