బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (15:40 IST)

ఆ భాగంలో నల్ల మచ్చలుంటే..?

మధుమేహ వ్యాధికి స్త్రీలు, పురుషులు అనే తేడా లేదు, వయసుతో సంబంధంలేదు. కాబట్టి ప్రతిఒక్కరు తమ ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా స్త్రీలలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నట్లు ఇటీవలే పరిశోధనలో వైద్యులు పేర్కొన్నారు. దీనికి కారణం వారి శరీర బరువు అధికంగా ఉండడం, వయసుతోపాటు వారిలోవచ్చే మార్పులు కూడా ఒకటని తెలిపారు.
 
స్త్రీలు గర్భంగా ఉన్నప్పుడు వారి రక్తంలో షుగర్ శాతం అధికమవుతుంది. దీనిని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. గర్భంలోని శిశువును ఆవరించి ఉండే మాయ స్రవించే హార్మోన్‌లు స్త్రీల శరీరంలో ఇన్సులిన్ ప్రభావాన్ని తగ్గిస్తుందని తత్ఫలితంగా వారిలో మధుమేహ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని వారు పేర్కొన్నారు. గర్భణీ స్త్రీలు 6, 7 నెలల్లో మధుమేహ వ్యాధి పరీక్ష చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
 
మధుమేహ వ్యాధిని గుర్తించండిలా...
నెలలు నిండకుండానే ప్రసవించడం, అధిక బరువు ఉన్న శిశువులు పుట్టడం, శరీరం మీద రోమాలు పెరగడం, మెడ వెనుక, చంకలవంటి భాగాలలో నల్లమచ్చలు ఏర్పడడం ఇవన్నీ మధుమేహ వ్యాధి లక్షణాలని వైద్యులు పేర్కొన్నారు.