శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (11:45 IST)

యాలకుల పొడితో పళ్లు తోముకుంటే..?

సాధారణంగా స్వీట్స్ ఎక్కువగా తయారుచేస్తుంటారు. స్వీట్స్ తయారీలో యాలకులు ఉపయోగిస్తారు. అలానే కేసరి, లడ్డూ, హల్వా వంటి వంటకాల్లో వాడుతుంటారు. వంటకాల్లో వీటిని వేయడం వలన చక్కని రుచి, వాసన వస్తుంది. సుగంధ ద్రవ్యాలలో యాలకులు ఒకటి. వీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం...
 
1. శరీరానికి అవసరమయ్యే నూనెలలో యాలకులు సమృద్ధిగా ఉంటాయి. భోజనం చేసిన తరువాత యాలకులు తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 
 
2. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు యాలకులను పొడిచేసి అందులో కొద్దిగా తేనె కలిపి సేవిస్తే అసిడిటీ బారి నుండి ఉపశమనం లభిస్తుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. 
 
3. యాలకుల్లో పొటాషియం, క్యాల్షియం, మెగ్నిషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ ఊపిరితిత్తుల్లో రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. ఆస్తమా వ్యాధితో బాధపడేవారు యాలకుల పొడిని పాలలో కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
4. హైబీపీతో బాధపడేవారు ప్రతిరోజూ అన్నంలో యాలకుల పొడి కలిసి తింటే సమస్య అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి మంచి ఔషధంగా పనిచేస్తుంది. 
 
5. కమ్మని సువాసన, రుచిని అందించే యాలకుల గింజలను పొడిచేసి ఈ పొడితో పళ్ళు తోముకుంటే చిగుళ్ళ సమస్యలు పోతాయి. దంతాలు దృఢంగా మారుతాయి. ముఖ్యంగా పళ్ల నుండి రక్తం రాదు. 
 
6. తలనొప్పితో బాధపడేవారు యాలకుల పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలుపుకుని నుదిటిపై రాసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కంటి చూపును మెరుగపరచుటకు యాలకులు చాలా మంచివి. 
 
7. క్యాన్సర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే రోజువారి ఆహారంలో యాలకులు చేర్చుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది.    
 
8. యాలకులను నీటిలో మరిగించి అందులో కొద్దిగా చక్కెర, కీరదోస రసం వేసి కాసేపు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే శరీర ఒత్తిడి, అలసట తగ్గుతుంది.