మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (15:31 IST)

వ్యాయామం చేస్తే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..?

వ్యాయామం మనేది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో అవసరం. అందుకు ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...
 
పదిహేను నుండి పాతికేళ్ల వయసు చాలా కీలకమైన దశ. ఈ వయసులోనే అందానికి, ఆరోగ్యానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి నిపుణులు హెచ్చరిస్తున్నారు. లావుగా ఉన్నవారే కాదు.. సన్నగా ఉన్నవారు కూడా వ్యాయామం చేయడం అవసరమే.. ఎందుకంటే...
 
వ్యాయామం చేయడం వలన శరీరంలో ఫీల్‌ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. అలానే క్యాలరీలు కరగడమే కాకుండా శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి. మృతకణాలు పేరుకోకుండా ఉంటాయి. చర్మం తాజాగా మారుతుంది. చిన్న వయసు నుండే వ్యాయామం చేయడం వలన భవిష్యత్తులో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 
 
చాలామంది ఉదయాన్ని లేవగానే టీ, కాఫీ, గ్రీన్ టీ ఇలా ఏదో ఒకటి తాగుతుంటారు. వీటిని ఉదయాన్నే సేవించడం అంత మంచిది కాదు. అందువలన నిద్రలేచిన 10 నిమిషాలు నానబెట్టిన బాదం పప్పులను పొట్టు తీసి తినాలి. ఉదయాన్నే కొవ్వుశాతం ఉన్న పదార్థాలు తింటే మంచిది. ఆపై 40 నిమిషాల తరువాత టీ, కాఫీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. అందుకని వెంటవెంటనే తీసుకుంటే ఫలితం ఉండదు. 
 
అమ్మాయిలకు విటమిన్ డి చాలా అవసరం. ఎంతో ముఖ్యం కూడా.. శరీరంలో విటమిన్ డి సరిగ్గా ఉన్నప్పుడే బయట నుండి తీసుకునే బి12 కూడా శరీరానికి సరిగ్గా అందుతుంది. విటమిన్ బి12 లోపిస్తే హార్మోన్ల అసమతుల్యత, నెలసరి సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

సాధారణంగా చిన్న వయసు గలవారు బయట ఆహారాలు భుజించుటకు ఆసక్తి చూపుతుంటారు. వాటిల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో బరువు విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే ఇంట్లో తయారుచేసిన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.