గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By PA Raman
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (09:26 IST)

17-11-2018 శనివారం దినఫలాలు - అనుకోని చెల్లింపుల వల్ల...

మేషం: ఐ.టి. రంగాల్లో వారికి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. నూతన ఒడంబడికలకు శ్రీకారం చుట్టండి. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయెద్దు. సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సహోద్యోగులతో సరదాగా గడుపగలుగుతారు. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతారు.
 
వృషభం: ఖర్చులు అనుకోని చెల్లింపుల వలన ఆటుపోట్లు తప్పవు. సోదరీసోదరుల మధ్య అవగాహన ఏర్పడుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వలన ఒత్తిడి చికాకులు ఎదుర్కుంటారు. స్త్రీలు శుభకార్యాలతో కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మిధునం: ఆర్థిక వ్యవహారాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు సమర్థవంతంగా సాగవు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. సంఘంలో మీ మాట తీరుకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి.
 
కర్కాటకం: ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకింగ్ రంగాలవారు అధిక ఒత్తిడిని శ్రమను ఎదుర్కుంటారు. స్త్రీలు దైవా, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవడం వలన కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి.
 
సింహం: నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజారిపోతాయి. విద్యార్థులకు అధిక శ్రమ అవసరం. విలువైన కానుకలను అందించి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటారు. కుటుంబీకుల మధ్య సంబంధ బాందవ్యాలు బలపడుతాయి.
 
కన్య: ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీక్షలు, దైవా, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన పరిచయాలేర్పడుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రాజకీయాలు, కళా, సాంస్కృతిక, ప్రకటనల రంగాల వారు లక్ష్యాలు సాధించడం కష్టం. రియల్ ఎస్టేట్ రంగాల్లో వారికి పురోభివృద్ధి.
 
తుల: వృత్తుల వారికి ప్రముఖులతో పరిచయాలేర్పడుతాయి. ట్రాన్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి ఊహించని సమస్యలు తలెత్తుతాయి. సంగీత, సాహిత్య, కళా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగుస్తాయి. మీ ఆశయ సిద్ధికి నిరంతర కృషి పట్టుదల ముఖ్యమని గమనించండి.
 
వృశ్చికం: చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి ఖాతాదారుల నుండి చికాకులు ఎదురవుతాయి. ఆథ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఏకాగ్రత వహించలేక పోవచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా, వివాహ విషయాలపట్ల దృష్టి సారిస్తారు. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి.
 
ధనస్సు: మందులు, ఆల్కహాలు, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు శుభదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. విందులు, వినోదాల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. విద్యార్థులకు మంచి మంచి ఆలోచనులు స్పురించగలవు. ప్రభుత్వ రంగ సంస్థల్లో వారికి అధిక శ్రమ, పనిభారం అధికం కాగలదు.
 
మకరం: కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభించగలదు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. సోదరీసోదరు మధ్య సఖ్యతాలోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. మీ విజయానికి మీ స్నేహితుల సహకారం లభించగలదు.
 
కుంభం: ఐ.టి. రంగాల్లో వారికి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మీ మంచి కోరుకునేవారు కంటే మీ చెడును కోరేవారే ఎక్కువుగా ఉన్నారు. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయెద్దు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు, శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలు వెళ్ళటానికి చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
 
మీనం: మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పుల వలన మాటపడతారు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. విలువైన వస్తువుల పట్ల అప్రమత్తత అవసరం. సిమెంటు, కలప, ఇటుక వ్యాపారులకు ఆశాజనకంగా ఉండగలదు.