శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Raman
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (08:42 IST)

16-11-2018 శుక్రవారం దినఫలాలు - ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు..

మేషం: ఆర్థికస్థితి సంతృప్తికరంగానే ఉంటుంది. ఊహించని సమస్యలెదురైనా తెలివిగా పరిష్కరిస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రోద్వలంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. స్త్రీలకు ఆరోగ్య విషయంలో ఏమరుపాటు కూడదు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఊహించని ఖర్చులు ఉంటాయి.  
 
వృషభం: ఆర్థిక విషయాలకు సంబంధించి స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తారు. బంధువులు, సోదరుల మధ్య ఆత్మీయతలు నెలకొంటాయి. దైవకార్యాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. లౌక్యంగా వ్యవహరించి మీ లక్ష్యాలను సాధిస్తారు.   
 
మిధునం: టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగాలలో వారికి కలిసి వచ్చేకాలం. చిట్క్, ఫైనాన్స్ వ్యాపారుల హితవు ఖాతాదారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి. హామీలు, సంతాకాల విషయంలో ఏకాగ్రత అవసరం. 
 
కర్కాటకం: ఒకానొక సందర్భంలో మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుండి అభ్యంతరాలు, పనివారలతో సమస్యలు తప్పవు. స్త్రీలకు అనవసర ప్రసంగాలు అపార్థాలకు దారితీస్తాయి. మెళకువ అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదాపడుతాయి. ఖర్చులు అధికమవుతాయి.  
 
సింహం: ఆర్థిక, కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో నిర్మొహమాటంగా వ్యవహరించండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అభాసుపాలవుతారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు అధికం. ఆత్మీయులు పరస్పరం విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.  
 
కన్య: దైవ సేవా కార్యక్రమాలకు ధనం బాగా వెచ్చించాల్సి ఉంటుంది. నూతన వ్యాపారాల్లో చికాకులు తొలగి అనుభవం గడిస్తారు. ఆహార, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉపాధ్యాయులకు శ్రమ అధికమవుతుంది. స్థిరాస్తి, వాహనం కొనుగోళ్ళు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
తుల: ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి సంఘంలో మంచి గుర్తింపు, తగిన ప్రతిఫలం లభిస్తుంది. బ్యాంకు పనులు వాయిదాపడుతాయి. పోటీ పరీక్షల్లో మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. మీ అవసరాలు, బలహీనతలను ఇతరులు స్వార్థానికి వాడుకుంటారు.  
 
వృశ్చికం: విధినిర్వహణలో ఉద్యోగులు చూపిన సమయస్పూర్తికి అధికారుల నుండి ప్రశంసలు, తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్త్రీలు నరాలు, రుత సంబంధిత చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. పారిశ్రామికి రంగాలవారికి ప్రోత్సాహకరం. అర్థాంతంగా నిలిపివేసిన పనులు పూర్తిచేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
 
ధనస్సు: పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. వనసమారాధనలు, దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
మకరం: బంధులకు పెద్ మెుత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం అవసరం. ఇతురుల సాయం కోసం ఎదురు చూడకుండా మీ యత్నాలు సాగించండి. సినీ కళాకారుల వలన రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీలకు కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కుంటారు.   
 
కుంభం: పట్టుదలతో అనుకున్నది సాధించి మీ సమర్థతను చాటుకుంటారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. విద్యార్థులు విదేశీ చదువుల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. నూతన పెట్టుబడులు, పొదుపు పథకాల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. 
 
మీనం: సన్నిహితుల హితోక్కులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. విదేశీయాన యత్నాల్లో అడ్డంకులు తొలగిపోగలవు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు షాపింగ్‌లోను, వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.