శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By raman
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (08:37 IST)

13-11-2018 మంగళవారం దినఫలాలు - స్త్రీలు తెలివి తేటలు...

మేషం: స్త్రీలకు ఇరుగు పొరుగువారితో సఖ్యత అంతగా ఉండదు. నూతన పరిచయాలు మీ ఉన్నతికి పురోభివృద్ధికి తోడ్పడుతాయి. చేపట్టిన పులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా సంతృప్తికరంగా పూర్తికాగలవు. ఇతరుల ఆనందం, తెలివి మిమ్మల్ని ఆకర్షిస్తాయి. భాగస్వామ్యుల మెుండి వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. 
 
వృషభం: ఆరోగ్యరీత్యా అధిక ధనవ్యయం తప్పదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీలు దైవ సేవా, కార్యక్రమాలలో నిమగ్నులౌతారు. మీ సంతానం మెుండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. పీచు, నార, లెదర్, ఫోమ్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును.    
 
మిధునం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఇతరులకు పెద్ద మెుత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. ఉపాధ్యాయులు విద్యార్థుల నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రేమికుల మధ్య విబేధాలు తలెత్తుతాయి. మీ నిర్లక్ష్యం వలన విలువైన వస్తువులు చేజార్చుకుంటారు.  
 
కర్కాటకం: స్త్రీలు తెలివి తేటలతో వ్యవహరించడం వలన కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా నడుస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని వ్యక్తుల నుండి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.    
 
సింహం: ఇంక్రిమెంట్లు, అడ్వాన్సులు లభిస్తాయి. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమించి పెండింగ్ పనులు పూర్తి చేయగల్గుతారు. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వస్తులాభం, వాహన యోగం వంటి శుభ ఫలితాలున్నాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. స్వయంకృషితో మీరు బాగా రాణిస్తారు.  
 
కన్య: ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వలన పై అధికారుతో మాటపడక తప్పదు. ఖర్చులు ఊహించినివే కావడంతో పెద్దగా ఇబ్బందులుండవు. మీ కళత్ర మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల ఏకాగ్రత అవసరం. బ్యాంకు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి.   
 
తుల: రాజకీయ రంగాల్లో వారికి విరోధుల విషయంలో అప్రమత్తత అవసరం. ధనం నిల్వచేయాలనే మీ యత్నం వాయిదా పడుతుంది. స్త్రీలు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. సన్నిహితులతో మీ కష్టాలు చెప్పుకోవడం వలన మానసికంగా కుదుటపడుతారు. వైద్యులకు మెళకువ అవసరం.  
 
వృశ్చికం: ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో అనుభవజ్ఞుల సలహా అడగడం మంచిది. దుబారా ఖర్చులు నివారించాలన్న మీ యత్నం ఫలించదు. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సోదరి, సోదరుల మధ్య ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. మీ లక్ష్యసాధనకు ఓర్పు, నిరంతర కృషి ముఖ్యం.  
 
ధనస్సు: పుణ్యక్షేత్ర సందర్శనలు, వనసమారాధనలు ఉల్లాసం కలిగిస్తాయి. ఒక యత్నం ఫలించలేదని నిరుత్సాహపడకుండా మళ్ళీ ప్రయత్నించండి. సఫలీకృతులవుతారు. ఇతురుల విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కుంటారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.  
 
మకరం: ప్రముఖ కంపెనీల షేర్ల విలువలు నష్టాల బాటలో సాగుతాయి. దైవదీక్ష స్వీకరించడంతో మీలో కొంత మార్పు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. చిట్స్, పైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారులతో సమస్యలు తప్పవు. ప్రముఖుల కలయికతో పనులు సానుకూలమవుతాయి.  
 
కుంభం: గృహంలో ఒక పుణ్యకార్యం నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. స్త్రీల ఆరోగ్యంలో మెళకువ అవసరం. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. దైవదీక్షల పట్ల ఆసక్తి నెలకొంటుంది. శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో డాక్టర్లకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.  
 
మీనం: సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కోర్టు వ్యవహారాలలో పనులు వాయిదా పడుతాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు చదివించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో చికాకులు క్రమేణా తొలగిపోగలవు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదాపడుతాయి.