మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (12:49 IST)

09-11-2018 శుక్రవారం దినఫలాలు - సంతానం అత్యుత్సాహం అనార్థాలకు...

మేషం: వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు పురోభివృద్ధి. మీ సంతానం మెుంటి వైఖరి వలన కుటుంబంలో కలహాలు తప్పవు. మీ పట్ల ముభావంగా వ్యవహరించిన వారు మీ సాన్నిత్యాన్ని కోరుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిని కార్యక్రమాల్లో మార్పులుండవు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లోపిస్తుంది. 
 
వృషభం: స్త్రీలు స్కీములు, ప్రకటనల వలన మోసపోయే ఆస్కారం ఉంది. సోదరీసోదరుల గురించి ఓ రహస్యం తెలుసుకుంటారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. వాయిదా పడినపనులు పునఃప్రారంభిస్తారు. స్వెక్యులేషన్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. 
 
మిధునం: మీ సంతానం అత్యుత్సాహం అనార్థాలకు దారితీస్తుంది. స్త్రీలు ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఇంటా, బయటా మీ మాటకు ఆదరణ లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు ఆందోళన కలిగిస్తాయి. హోటల్, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. 
 
కర్కాటకం: ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం, కీలకమైన వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవడం క్షేమదాయకం. మీ అతిధి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయి. మిత్రుల సహకారంతో ఒక సమస్య నుండి గట్టెక్కుతారు. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రుణాలు చేబదుళ్లకు యత్నాలు సాగిస్తారు. 
 
సింహం: స్త్రీలకు అలంకారాలు, విలాసవస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. దంపతుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతం శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. ఏజెంట్లు, బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి నిరంతర శ్రమ, ఓర్పు ఎంతో ముఖ్యం. 
 
కన్య: బ్యాంక్ వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ప్రయాణాలు అనుకూలం. బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి లోనవుతారు. వాహన చోదకులకు ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు స్వీయ సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల: పత్రికా, వార్తా సంస్థల్లోని వారికి పరీక్షా సమయం. అకాల భోజనం, పనిభారం వలన ఆరోగ్యం మందగిస్తుంది. కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు కలిసిరాగలదు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. 
 
వృశ్చికం: ఆర్థికలావేదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి మెుండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. దూరప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. ఒక స్థిరాస్తిని అమర్చుకుంటారు.  
 
ధనస్సు: ప్రముఖుల కలయిక వాయిదా పడడంతో నిరుత్సాహానికి గురవుతారు. ఉద్యోగస్తులు ఆశించిన ప్రమోషన్లు, బదిలీలు అనుకూలించడానికి మరి కొంతకాలంపడుతుంది. గృహంలో మార్పులు చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. స్త్రీలు పొట్ట, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కుంటారు.  
 
మకరం: నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి కానరాగలదు. రాజకీయ నాయకులు సభా, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దంపతుల మధ్య ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలు పంతాలకు పోకుండా విజ్ఞతతో వ్యవహరించవలసి ఉంటుంది. 
 
కుంభం: ఉద్యోగస్తులు తోటివారి కారణంగా అధికారులతో మాటపడవలసి వస్తుంది. మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. బ్యాంకు వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. విద్యార్థినులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ముఖ్యం. అధికారులతో సంభాషించేటపుడు జాగ్రత్త అవసరం. 
 
మీనం: తరచు దైవా, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. పీచు, నార, ఫోమ్, లెదర్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండును. ట్రాన్స్‌పోర్టు, ట్రావెలింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. వీలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం శ్రేయస్కరం.