సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (09:48 IST)

10-11-2018 - శనివారం మీ రాశిఫలితాలు - తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి...

మేషం: గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. విద్యార్థుల తొందరపాటు తనానికి చింతించవలసి ఉంటుంది. స్త్రీలు అవివేకంగా ప్రవర్తించడం వలన మాటపడక తప్పదు. నిరుద్యోగులలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ థ్యేయం నెరవేరుతుంది. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు.
 
వృషభం: మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవడం మంచిది. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. మన సమారాధనల్లో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు చేయడం అంత క్షేమదాయకం కాదు.  
 
మిధునం: ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పాత వస్తువులు కొనడం వలన ఇబ్బందులు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో మీ మాటకు గౌరవం లభిస్తుంది. స్థిరాస్తి క్రయవిక్రయాలు సంతృప్తికరంగా ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. 
 
కర్కాటకం: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. బ్యాంకు పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. కొన్ని వ్యవహారాల్లో జరిగిన కాలయాపన వలన ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మీ శ్రీమతి సలహా పాటించడం వలన ఒక సమస్య నుండి బయటపడుతారు. దైవ దీక్షలు, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి కలుగుతుంది.   
 
సింహం: స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత అవసరం. మిమ్మల్ని తప్పుపట్టిన వారు తమ తప్పును తెలుసుకుంటారు. మీ పాత వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు ఆశించిన రీతిలో పూర్తిచేస్తారు. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.  
 
కన్య: శస్త్రచికిత్స చేయునపుడు వైద్యులకు మెళకువ అవసరం. సంఘంలో గుర్తింపు, గౌరవం పొందుతారు. ఉద్యోగస్తులు ప్రలోభాలకు దూరంగా ఉండడం మంచిది. ఐరన్, సిమెంట్, కలప రంగాలలో వారికి వారి రంగాలలో చురుకుదనం కానవస్తుంది. సన్నిహితులు ఒక వ్యవహారంలో మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు.  
 
తుల: రాజకీయాలలో వారికి రహస్యపు విరోధులు అధికం అవుతున్నారని గమనించండి. మీ కళత్ర మెుండివైఖరి మీకు ఎంతో చికాకు, ఆందోళన కలిగిస్తుంది. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు.  
 
వృశ్చికం: ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉండవు. స్త్రీలు పనివారల నుండి ఒత్తిడి, చికాకులు ఎదుర్కుంటారు. దైవదర్శనాలు, మెుక్కుబడులు అనుకూలిస్తాయి. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది.   
 
ధనస్సు: ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, చుట్టుపక్కల వారి ప్రోత్సాహం లభిస్తుంది. మీ సంతానం పై చదువుల విషయం వారి ఇష్టానికి వదిలేయడం మంచిది కాదు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. క్రయవిక్రయాలు లాభసాటిగా ఉంటాయి.   
 
మకరం: వ్యవసాయ, తోటల రంగాల్ల వారికి వాతావరణంలో మార్పు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలు, లీజుల, ఏజెన్సీల వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
కుంభం: స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. చిన్నారుల, విద్య ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయంలో ఖర్చలు అంచనాలు మించుతాయి. క్రీడా రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ వ్యవహారం కలిసి రాకపోవడంతో ఆందోళన చెందుతారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి.  
 
మీనం: ప్రయాణాలు, బ్యాంకింగ్ వ్యవహారాలు వాయిదాపడుట ఒకందుకు మంచిదేనని గమనించండి. అర్థాంతరంగా నిలిపివేసిన పనులు పునఃప్రారంభమవుతాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన విషయంలో ఆచితూచి వ్యవహరించండి. బృంద కార్యక్రమాల్లో గుర్తింపు లభిస్తుంది. పాతరుణాలు తీరుస్తారు.