నట్స్‌లో ఏముందనుకునేరు.. బరువును ఇట్టే తగ్గించేస్తాయ్...!
నట్స్‌లో ఫైబర్, ప్రోటీన్లు, హెల్దీ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా వున్నాయి. ఇవి బొజ్జలోని అనవసరపు కొవ్వును కరిగిస్తాయి. అందుకే నట్స్‌ను రోజూ డైట్‌లో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడిని జయించగలిగే శక్తి నట్స్‌లో పుష్కలంగా దాగివుంది.
సాయంత్రం పూట జంక్ ఫుడ్స్‌ను స్నాక్స్‌గా తీసుకునేకంటే.. నట్స్‌ను తీసుకుంటే బరువు పెరగకుండా చూసుకోవచ్చు. బాదం పప్పుల్లో ప్రోటీన్లు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా వుండటంతో రోజుకు మూడు నుంచి ఐదు బాదంలను తీసుకుంటే.. బరువు తగ్గుతారు.
అలాగే వాల్‌నట్స్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్ కొలెస్ట్రాల్ పెంపొందింపచేస్తాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. వాల్‌నట్స్ రోజుకు రెండేసి తీసుకుంటే ఒబిసిటీతో తిప్పలు వుండవు. పిస్తాపప్పులు కూడా ప్రోటీన్లను పుష్కలంగా కలిగివుండటం చేత.. కండరాలకు మేలు చేస్తుంది.
బరువును నియంత్రిస్తుంది. జీడిపప్పుల్లోని మెగ్నీషియం మెటాబలిజాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వు, కార్బోహైడ్రేడ్లు బరువును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.